Sunday, 16 November 2014

PoSt:7:- బాల భాషామేధావి-డా.బూదరాజు రాధాకృష్ణ-

డా.బూదరాజు రాధాకృష్ణ-    
ఆం.ప్ర.తెలుగు అకాడమీ డెప్యూటీ డైరెక్టరుగాబహుగ్రంధకర్తగా, "ఈనాడుదినపత్రిక జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్ గాభాషాకోవిదునిగా-బహుముఖ విఖ్యాతి గాంచిన విజ్ఞానఖనిఈయన మన హైస్కూలులో 1940లలో విద్యార్ధిఅంతేగాకవిద్యార్ధి దశలోనే-అద్భుతమైన భాషాపాండిత్యం ప్రదర్శించేవారుచిన్నతనంలోనేఅనర్గళంగా ఆశువుగా పద్యాలు చెప్పగలిగేవారు బాల భాషామేధావి-విద్యార్ధిగా వుండగా-ఒక విశేషం జరిగింది

ఆరోజుల్లోఉద్దండ పండితులు"కళాప్రపూర్ణకొత్త సత్యనారాయణ చౌదరిములుకుట్ల గోపాలకృష్ణయ్యగూడ సత్యనారాయణ శాస్త్రి తదితర ప్రముఖులు మన హైస్కూలులో తెలుగు బోధించేవారుసింగరాజు శ్రీనివాసరావుగారు ప్రధానోపాధ్యాయులు
 కొత్త సత్యనారాయణ చౌదరిగారు

    
    గూడ సత్యనారాయణ శాస్త్రి 

బూదరాజుగారి క్లాసుకు కొత్త సత్యనారాయణ చౌదరిగారు తెలుగు ఉపాధ్యాయులువార్షిక పరీక్షలో తెలుగులో  క్లాసులోని విద్యార్ధులంతా ఉత్తీర్ణులైనారుఒక్క బూదరాజుగారు మాత్రమే తెలుగు పరీక్షలో తప్పారు. మిగతా అన్ని సబ్జక్టులలో క్లాసులో అత్యధిక మార్కులు వచ్చాయిఅంత భాషామేధావి తెలుగులో తప్పడం-తోటి విద్యార్ధులకే కాకఉపాధ్యాయులందరికీచివరకు హెడ్మాస్టర్ గారికి కూడా ఆశ్చర్యమేసింది.
హెడ్మాస్టరుగారు తన గదిలో తెలుగు ఉపాధ్యాయులందర్నీ సమావేశపరిచారుబూదరాజుగారి తెలుగు పరీక్ష సమాధానపత్రాలు తెప్పించిఉపాధ్యాయులందర్నీపరిశీలించి విద్యార్ధి ఎందుకు తప్పాడో కారణం చెప్పమని పురమాయించారుచౌదరిగారు తప్పమిగిలిన పండితులంతా పత్రాలు చూసి- " ఆహాసమాధాన పత్రం మొత్తం అన్ని ప్రశ్నలకు సమాధానాలూఆశుపద్యాలలో వ్రాశాడువీడి కవితాధార పెద్దలలోకూడా అసాధ్యంవీటికి సున్నా మార్కులు వేయడం ఏమిటిమరేదో కారణం మనసులో పెట్టుకుంటే తప్ప-వీణ్ణి తెలుగులో తప్పించడానికి వీల్లేదు."-అని తీర్మానించారుహెడ్మాస్టరుగారు  తరగతి తెలుగు ఉపాధ్యాయుడైన చౌదరిగారిని వివరణ అడిగారుఅందుకాయన- " అయ్యా! గద్యభాగ సమాధానాలు గద్యంలోనే వ్రాయాలిఇతనుతనకు ఆశు రచన వచ్చునని చాటుకోవడానికే  సమాధానాలు ఆశు పద్యాలలో వ్రాశాడువిద్యార్ధికి పాండిత్యం వున్నదికాని జవాబులు అడిగిన రీతి లోనే వ్రాయాలి కదాలేకపోతేఅడిగిన సమాధానం అతనికి రాదని అనుకోవాలిఅందుకే సున్నా మార్కులు వేశాను."-అని చెప్పారు.  


            అడిగిన రీతిలో మరల పరీక్ష అక్కడికక్కడే వ్రాసి నూరు శాతం మార్కులు సాధించారు బూదరాజు!!
                                                          

No comments:

Post a Comment